తిరుప్పావై పాశురాలు - తెలుగు గజల్స్ (వీడియోతో)
గోదా దేవి ప్రార్థన:
భగవద్బంధువులకు నమస్కారం.
నీళాతుంగ స్తనగిరితటీ సుప్త ముద్భోద్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిర స్సిద్ధ మధ్యాపయన్తీ|
స్వోచ్చిష్టాయాం స్రజినిగళితం యాబలాత్ కృత్య భుఙ్క్తే (భుంక్తే)
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః||
మీరు పూజలో పాడుకునేటందుకు వీలుగా వ్రాసిన గీతం
పై ప్రార్థనకు అనువాదం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
తెలుగు గజల్:
గానామృతసుధలుపంచు జగదంబకు ప్రణతులివే !
కృష్ణభక్తి మధువుగ్రోలు మధుపమునకు ప్రణతులివే !
నీళాస్తన గిరులసుప్త యదుసింహుని లేపితివే
నిగమార్థ సారముగల గీతములకు ప్రణతులివే!
ముడిచినట్టి విరిదండల రంగనిబంధించినావు
పూమాలలు అల్లినకరకమలములకు ప్రణతులివే!
సుఖాలలో మత్తిల్లిన జగతికిగతి చూపితివే
మాతానీ కరుణాన్విత హృదయమునకు ప్రణతులివే!
తులసీవన సంజాతా!పెరియాళ్వార్ ప్రియపుత్రీ !
భక్తిముక్తి దాయకమౌ చరితమునకు ప్రణతులివే !
🌹 ధనుర్మాసం మొదటిరోజు పూజ 🌹: (1 వ రోజు)
ఆర్తజన పరాయణుడైన శ్రీరంగనాథ స్వామికి, భక్తజన చింతామణి
మాత గోదాదేవికి కరములు జోడించి ప్రణమిల్లుతూ మొదటి పాశురాన్ని
శ్రీమతి రత్నచర్లగారి గానంతో భక్తులకు అందిస్తున్నాను.
పాశురం - 1 మూలం (తమిళము):
మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.
తెలుగు గజల్:
మంచిమాసము మార్గశీర్షము తెలుసుకొనుడీ సుదతులారా
తుంచి కోర్కెలు రంగనాధుని తలచుకొనుడీ సుదతులారా !
రోజురోజుకు పెరుగు చంద్రుడు వెండివెన్నెల కురియసాగెను
శుభములిచ్చును శుక్లపక్షము మాటవినుడీ సుదతులారా!
మించనీయక తూర్పువెలుగును స్నానములకైతరలివెళదాం
బద్ధకాన్నే వదిలిపెట్టీ మేలుకొనుడీ సుదతులారా !
రవిసుధాకర లోచనుండై జగతికావగ వచ్చెనమ్మా
మరోనేత్రం రవిని తెరిచెను వేగచనుడీ సుదతులారా !
నందగోపుని ముద్దుబిడ్డగ వెలసెనమ్మా నందవ్రజమున
నీలమేఘశ్యాముడమ్మా తెలుసుకొనుడీ సుదతులారా
యశోదమ్మకు ముద్దుపట్టిని బాలసింహుని చూడరమ్మా
నందనందను వ్రతముచేయగ బయటపడుడీ సుదతులారా !
ఆనారాయణు నమ్ముకొనుడీ పరనుఇచ్చే వాడతండే
బద్ధకించక కంకణాలను కట్టుకొనుడీ సుదతులారా !
🌹 ధనుర్మాసం రెండవరోజు పూజ 🌹: (2 వ రోజు)
సిరినోము పూజకు, తిరుప్పావై రెండవ పాశురం మూలమూ మరియు
నా గజల్ అనువాదమూ... వినండి
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: మోహన
తాళం: ఖండచాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రకారులు: శ్రీ కేశవ్ గారు
పాడిన గాయనీమణి: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 2 మూలం (తమిళము):
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్.
తెలుగు గజల్:
సుఖాలెన్నో అనుభవించాం చాలుచాలిక వనితలారా !
పరమసుఖమును పొందుదారిని వెతకవలెనిక వనితలారా!
శ్రీకరంబౌ ధనుర్మాసము రంగనాధుడు మెచ్చునట్టిది
శుభమునొసగే తిరునామమే దిద్దవలెనిక వనితలారా!
నోము నోయగ నియమనిష్టలు ప్రీతిమీరగ ముందు వినుడీ
దేహమోహము ,అలంకారము మానవలెనిక వనితలారా!
పూవులన్నీ కమలనాభుని కంఠమాలకు వాడుదామా
క్షీరఘృతములు గోపకాంతున కీయవలెనిక వనితలారా!
చిన్నపెద్దల నెవరినైనా తూలనాడుట మహాపాపము
పలకరానివి చేయరానివి వీడవలెనిక వనితలారా!
జీవులన్నీ దేవుడనుకొని సకలజీవుల మెలుకోరుము
లోకసుఖముకు మనము నోమును నోచవలెనిక వనితలారా!
🌹 ధనుర్మాసం మూడవరోజు పూజ 🌹: (3 వ రోజు)
మూడవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: హిందోళ
తాళం:చాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రకారులు: శ్రీ కేశవ్ గారు
పాడిన గాయనీమణి: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 3 మూలం (తమిళము):
ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మూరి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్
తెలుగు గజల్:
దీక్షపట్టి హరిచరితము చదువవలెనె సఖియరో !
విష్ణు మహిమ మనసారా పాడవలెనె సఖియరో !
వామనుడై వచ్చినాడు బలినిదాన మడిగినాడు
భూనభములు కొలిచినకథ పలుకవలెనె సఖియరో !
త్రివిక్రముని వలెఎదుగుచు పంటబాగ పండుతుంది
జనావళికి సంక్షేమము తలచవలెనె సఖియరో !
సుభిక్షమౌ దేశాలే పరమాత్ముని స్మరణతోటి
సదాచార మర్చనయని తెలియవలెనె సఖియరో!
పాడిపంట కొరతుండదు చేలల్లో చేపలెగురు
నోమిదియని నమ్మికతో చేయవలెనె సఖియరో !
🌹 ధనుర్మాసం నాల్గవరోజు పూజ 🌹: (4 వ రోజు)
నాల్గవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: హిందోళ
తాళం: త్రిశ్ర త్రిపుట
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రకారులు: గూగుల్ సేకరణు
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 4 మూలం (తమిళము):
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్.
తెలుగు గజల్:
(రేపల్లె గోపికలను ఆండాళ్ళు తల్లి పిలుస్తున్నది)
హరి ధనువు సిరికిచ్చె నారినే కట్టగా
శార్జ్గమే మాధవా వేయుమావేగమే!
శరపరంపరలాగవర్షాలు కురనాలి
నీ చేతిచక్రమే విసరుమా వేగమే!
పర్జన్య దైవమా లోభమే వలదయ్య
మేఘమా కరుణంచి కురియుమా వేగమే!
ఘనసుందరాకార మాపాలి పర్జన్య
వానదేవుని ఇటకు పంపుమా వేగమే !
కడలిలో నీరంత కడుపార త్రాగుమా
కన్నయ్య నలుపంత పొందుమా వేగమే!
పాంచజన్యమువోలె ఉరముచునింగిలో
సుదర్శన కాంతులే చూపుమా వేగమే!
వాగులూ కొలనులూ నిండాలిఅంతటా
వరుణుడా వానలే కురియుమా వేగమే
మానోము పండించి కావేటిరంగయ్య!
గోదనే పెళ్ళాడ కదలుమా వేగమే!
ఆండాళ్ళు కోరుకొను వరమిదే శ్రీరంగ!
దయదలచి నన్నింక బ్రోవుమావేగమే!
🌹 ధనుర్మాసం ఐదవరోజు పూజ 🌹: (5 వ రోజు)
ఐదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: సింధు భైరవి
తాళం: ఖండచాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: గూగుల్ సేకరణ
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 5 మూలం (తమిళము):
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎwమ్బావాయ్
తెలుగు గజల్:
కృష్ణలీలలుమధురమైనవి నమ్మలేనివి వినండమ్మా!
ముద్దులొలికే చిలిపిపనులనుమరువలేనివి వినండమ్మా!
దేవుడైనా ఏమిఎరగని బుజ్జితండ్రై గొడవచేసెను
గోకులంలో మాయలన్నీ అంతులేనివి వినండమ్మా!
యశోదమ్మను ఎన్నితిప్పలు పెట్టినాడే చిక్కకుండా
ఆగడాలను పతికికూడా చెప్పలేనివి వినండమ్మా!
త్రాడుతెచ్చీ రోటగట్టగ గంధర్వులకు బాపె శాపము
ఊహనైనా కన్నతల్లికి అందరానివి వినండమ్మా !
కట్టుబడెదను ప్రేమకంటూ దామోదరు నామమొందెను
కవులుసైతం వీనిమహిమలు పొగడలేనివి వినండమ్మా!
మనసునిలిపీ పూజచేసిన దూదివోలే కాలుపాపము
మధుర వాసుల సుకృతాలే ఎంచలేనివి వినండమ్మా !
హరినిచేరే కోర్కెచాలును ఇతరకోరిక కోరవలదే
ఇతరమేవీ మంచిమనసుతొ తూగలేనివి వినండమ్మా !
దనుజహారికి హారతిద్దాం పుణ్య పురుషుని పూజచేద్దాం
బ్రోవమంటూ ఇన్నినాళ్ళూ పాడలేనివి వినండమ్మా !
🌹 ధనుర్మాసం ఆరవరోజు పూజ 🌹: (6 వ రోజు)
ఆరవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: సిచలనాట
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 6 మూలం (తమిళము):
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావా
తెలుగు గజల్:
కాకుల అరుపులు కోవెలగంటలువినబడలేదా మేలుకో చెలీ!
శంఖనినాదము భక్తుల అలజడి జొరబడలేదా మేలుకో చెలీ!
కళ్ళను తెరిచిన చాలదు తల్లీ మనసునుకూడా తట్టిలేపవే
పరమార్థముకై ఆలోచనలే అలవడలేదా మేలుకో చెలీ!
విషమును చన్నుల పూసుకువచ్చినరక్కసిపూతన ప్రాణముతోడెను
ఎంతటివాడో నీకైనీకే కనబడలేదా మేలుకో చెలీ!
చంటిబిడ్డగాశకటాసురుని ఉసురులుతీసిననారాయణుడే
యోగనిద్రలో శయనిస్తాడని చెవిబడలేదా మేలుకో చెలీ!
పరగునరావేపూజలుచేస్తూపాపాలన్నీ పారద్రోలుదాం
మంచిసమయము మించిపోవునని భయపడలేదా మేలుకో చెలీ!
🌹 ధనుర్మాసం ఏడవరోజు పూజ 🌹: (7 వ రోజు)
ఏడవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: సావేరి
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 7 మూలం (తమిళము):
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్
తెలుగు గజల్:
చెట్లమీద పక్షులన్ని మేతలకై సిద్ధమాయె !
గోపాలురు ఆలమంద తోలుటకై సిద్ధమాయె!
నువుమాత్రం ఇల్లువదిలి రావింకా హరిపూజకు
చెలులంతా శీతలస్నానాలకై సిద్ధమాయె!
గిరివ్రజమున గోపెమ్మల కృష్ణ ప్రేమ గుర్తుందా?
పాటపాడుతూపెరుగును చిలుకుటకై సిద్ధమాయె!
మధురమైన పాటలన్ని మనోహరుడు హరిమీదే
సూత్రాలే తాళాలుగ మారుటకై సిద్ధమాయె!
విరితావుల ఘుమఘమలకు మేనుపరవశించెనేమొ
భామలపద పల్లవాలు నర్తనకై సిద్ధమాయె !
కేశిచంపి కేశవుడై ప్రదర్శించె విక్రమాన్ని
కృష్ణ మూర్తి జగద్రక్ష చేయుటకై సిద్ధమాయె !
మోహనుడూ శౌర్యధనుడు గోవిందుని అర్చిద్దాం
నిన్నడగక నీమదియే వలచుటకై సిద్ధమాయె !
🌹 ధనుర్మాసం ఎనిమిదవరోజు పూజ 🌹: (8 వ రోజు)
ఎనిమిదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: రంజని
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 8 మూలం (తమిళము):
కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
తూర్పు మనకు మార్గదర్శి తామసాన్ని వదలవే!
మనసు తెలుపు చేసుకోగ వాంఛలన్ని విడువవే!
నెచ్చెలులను వదిలినేను నీకోసం ఆగితే
మనోనాధు కలుసుకోగ పనులనన్ని మానవే!
నీభక్తిని ఎరిగినేను నీతోడును కోరితే
ఇంద్రియాల అదుపుచేయు దారులన్ని నేర్పవే!
తననుచేర తపన చూసి తనకుతాను తరలులే
దాసులమని దయజూపే సేవలన్ని చెప్పవే!
అశ్వరూపు డైనదైత్యు మూతివిరిచి సూచించె
బుద్ధిచెరుచు తురంగాల పరుగులన్ని ఆపవే!
బాలుండై మల్లులనే మట్టుబెట్టె వింతగా
జగన్నాథు మనసుదోచు పాటలన్ని పాడవే!
🌹 ధనుర్మాసం తొమ్మిదవరోజు పూజ 🌹: (9 వ రోజు)
తొమ్మిదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: రకామాసు
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 9 మూలం (తమిళము):
తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్
దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం
మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్
మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్
ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో
ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో
మామాయన్ మదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు
నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
అగరుధూపం మత్తులోనే ఒడలు మరిచీ నిద్రపోకే!
మెత్తనైనా తల్పమందే జగముమరిచీ నిద్రపోకే!
మణిమయంబౌ మేడచుట్టూ వెలుగుతున్నవి దీపకళికలు
తెల్లవారుట చూడకుండా విధులుమరిచీ నిద్రపోకే!
కృష్ణుడొస్తే ఏమిభయమను పొగరుమాటలు వదలవమ్మా
మామకూతుర సుఖముమరిగీ తనువుమరిచీ నిద్రపోకే!
గడియతీయవె వడిగరావే బదులుపలకవు మూగవేమో
భ్రమలువదిలీ బయలుదేరుము క్రమము మరిచీ నిద్రపోకే!
మేనయత్తా చెప్పవమ్మా నీకూతురు చెవిటిదేమో
బద్ధకాన్నే పారద్రోలుము వ్రతముమరచీ నిద్రపోకే !
సకలసద్గుణధాముడమ్మా మహాలక్ష్మికి నాథుడమ్మా
మనలచూడగ ఇలకువస్తే నోము మరిచీ నిద్రపోకే!
🌹 ధనుర్మాసం పదవరోజు పూజ 🌹: (10 వ రోజు)
పదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: మలయమారుతం
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 10 మూలం (తమిళము):
నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱ అమ్మనాయ్
మాత్తముం తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్ పండొరునాళ్
కూత్తత్తిన్ వాయ్వీళంద కుమ్బకరణనుం
తొత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో
ఆత్త అనందల్ ఉడైయాయ్! అరుంగలమే
తేత్తమాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్
తెలుగు గజల్:
తలుపుతీయ వద్దులేవె అందమైన ప్రియసఖీ
బదులిచ్చుట చాలునులే ఇష్టమైన ప్రియసఖీ
అందరివాడైనవాని డెందమునీసొంతమాయె
కీర్తింతుము చూపించిన మేటివైన ప్రియసఖీ!
మనఅందరి గోవిందుడె త్రేతాయుగ శ్రీరాముడు
విన్నావా ఆగాధను చక్కనైన ప్రియసఖీ
తననిద్రను నీకిచ్చెను కుంభకర్ణు డనుకుంటిమి
కాకయోగ నిద్రోయిది రమ్యమైన ప్రియసఖీ!
నోముపూర్తి చేసితమరు శయనించితిరేమోలే
నల్లనయ్య పాదాలకు చేరువైన ప్రియసఖీ!
మానోముల సంగతేంటి ఒక్కమాట చెప్పవా
మాధవునే మెప్పించుట సాధ్యమైన ప్రియసఖీ!
మేముకూడ నోమునోయ ముడుపుకట్టుకున్నాము
మాబ్రతుకులు పండించవె ఙ్ఞానివైన ప్రియసఖీ!
ఎల్లెడలా నిండినట్టి నారాయణుడేకృష్ణుడు
ఇంటిలోన దాచవలదు శ్రేయమైన ప్రియసఖీ!
తులసిమాల పరిమళాలు బయటపెట్టె స్వామిఉనికి
పాలుపంచు వానిప్రేమ రుచిరవైన ప్రియసఖీ!
🌹 ధనుర్మాసం పదకుండవరోజు పూజ 🌹: (11 వ రోజు)
పదకుండవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: అభోగి
తాళం: ఖండచాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 11 మూలం (తమిళము):
కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
పొగరుమోతౌ ఆవుకైనా పాలు పితికిన గోపకాంతవి!
పగతుప్రాణము పొదుగులాగా పిండగలిగిన వీరవనితవి!
నాగమణివలెమెరిసిపోయే జఘన సుందరి చేయి కలుపుము
నెమలిపింఛపు నిగనిగలనే కురుల దాల్చిన ముగ్ధ మెలతవి!
అందమంతా పోతపోసిన బొమ్మవనుచూ చెప్పుకుంటాం
నందగ్రామము నందుపుట్టిన నేర్పు మీరిన ధీర గరితవి!
తలుచుకుంటే నిద్రనెందుకు జయించరాదొ తెలియకున్నది
విష్ణుకీర్తన తియ్యతియ్యగ పాడగలిగిన మంచి ముదితవి!
యమునలోనా మునకలేసీ శ్రీనివాసుని భజనచేద్దాం
గొంతుకలిపీ మధుర గానము నేర్పవలసిన గొల్లనెలతవి!
మేలుకోవే మంచిపిల్లా ! వ్రతముమాతో పంచుకోవే
ముక్తి మార్గము చేరుకుందాం దారితెలిసిన స్నేహ చరితవి!
🌹 ధనుర్మాసం పన్నిండువరోజు పూజ 🌹: (12 వ రోజు)
పన్నిండువ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: బహుదారి
తాళం: ఖండచాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 12 మూలం (తమిళము):
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
తెలుగు గజల్:
అన్నకేమో ఆఅనంతుని సేవలోనే గడిచెకాలం!
చెల్లికేమో అంతులేనీ నిద్రతోనే గడిచెకాలం!
దూడఅరుపులు విన్నఆవుల పొదుగుచేపెను
యాదవునకా శ్యామసుందరు స్మరణతోనె గడిచెకాలం!
పాలధారలు కారిపోగా కొట్టమంతా బురదఅయినది
మంచుకమ్మిన వేగుజామున వణుకుతోనే గడిచెకాలం!
కిందబురదకు పైనమంచుకు తాళజాలము వేళమించెను
జామునించీ చూరుపట్టుకు పిలుపుతోనే గడిచెకాలం!
పత్నిసీతను రక్షసేయగ రావణాసురుఁజంపెరాముడు
రామ కథనే పాడుదామన జాగుతోనే గడిచెకాలం!
🌹 ధనుర్మాసం పదమూడవరోజు పూజ 🌹: (13 వ రోజు)
పదమూడవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: పంతువరాళి
తాళం: తిశ్ర త్రిపుట
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 13 మూలం (తమిళము):
పుళ్ళిన్ వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
వెళ్ళి యెరుందు వియారం ఉఱంగిత్తు
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పోదరి క్కణ్ణినాయ్
కుళ్ళ కుళిర క్కుడైందు నీరాడాదే
పళ్ళి క్కిడత్తియో పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరుందు కలంద్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
చిగుళ్ళవలె దశకంఠుని శిరసులనే కోసినాడు
బద్ద వలే బకాసురుని నాసికనే చీల్చినాడు!
రాముడాయె కృష్ణుడాయె లోకాలను ఉద్ధరింప
మనకోసం ప్రేమామృత భాండమునే తెచ్చినాడు!
వానిమహిమ కీర్తింపగ హరిణాక్షీ కలవవేమె?
వేణువూది మనసుదోచి విరహమునే పెంచినాడు!
విరహాగ్నిని చల్లార్చక శయనించితి వేమిసఖీ!
వ్రతము చేయ రాకుండా మాయలనే కప్పి నాడు!
గురుశుక్రులు గతులుమారు ప్రదోషంపు కాలమిదియె
భాస్కరుండు శభముహూర్త ఘడియలనే చేరినాడు!
పద్మలమై కొలనులోకి దిగుదామా స్నానాలకు
తుమ్మెదవలె నల్లనయ్య లోపలనే తిరిగినాడు!
కపటమునే వీడివచ్చి గానములోగొంతుకలుపు
దైవంబే నీగళమున మధువులనే నింపినాడు!
🌹 ధనుర్మాసం పద్నాల్గవరోజు పూజ 🌹: (14 వ రోజు)
పద్నాల్గవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: కల్యాణ వసంతం
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 14 మూలం (తమిళము):
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
చెప్పిన మాటలు తప్పెద వేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో
మంచంపైనే కదిలెదవేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
కలువలు వడిలెను,విచ్చెకమలములు ..పెరడునఉన్నా దిగుడుబావిలో
మీనమేషములు ఎంచెదవేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
అందరికన్నా ముందేలేచీ ...నిద్రలేపుతా నంటివిగదటే
మౌనవ్రతమే పూనెదవేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
కాషాయాంబర ధారులుమౌనులు ..రంగనిసేవకు గుళ్ళకు వెళ్ళిరి
ఇంతాలస్యము చేసెదవేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
శంఖము చక్రము దాల్చినవానీ... మహిమల కీర్తన మధురముగాదా!
వలచిన కృష్ణుని మరిచెదవేమే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
ఆయతబాహుడు తామరసాక్షుడు ...గానలోలుడే నందబాలుడూ
పుట్టెడు ఆశలు వమ్ముచేయకే ...ఏమన్నావోగుర్తుచేసుకో!
🌹 ధనుర్మాసం పదిహేనవరోజు పూజ 🌹: (15 వ రోజు)
పదిహేనవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: వళగి
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 15 మూలం (తమిళము):
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
తెలుగు గజల్:
లేత చిలుకా వంటి లేమా!తలుపుతీయవె సుందరాంగీ!
*ఇంత రాతిరి వచ్చి గొడవా ముందు చెప్పవె సుందరాంగీ!
తెల్ల వారెను నమ్మవమ్మా వచ్చి చూడూతెలుస్తుందీ
*మొత్తమంతా కూడినారా నిజము పలుకవె సుందరాంగీ!
పడక వదిలీ బయటికొచ్చీ లెక్కపెట్టవె తెలుస్తుందీ
కృష్ణ భజనలునీవుకూడాఆలపించవె సుందరాంగీ!
కువలయపీడ నామధేయుడు గజాకారుడు రక్కసుండు
చిటికలోపల వాని చంపిన గాధ పాడవె సుందరాంగీ!
కంసమామ పీడబాపీ కన్నవారికి సుఖము గూర్చెను
తాతగారిని రాజుచేసిన హరినితలచవె సుందరాంగీ!
తిరుప్పావై పాడుకుంటూ కలిసినోమును నోచుకుందాం
రంగరంగని అంతరంగము నందు నిలువవె సుందరాంగీ!
🌹 ధనుర్మాసం పదహారవరోజు పూజ 🌹: (16 వ రోజు)
పదహారవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: భైరవి
తాళం: ఆది
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 16 మూలం (తమిళము):
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
భువన పాలకు భవనపాలక ! తలుపు తెరువుము హరిని చూడగ!
మహాద్వారపు మణులు పొదిగిన గడియ తీయుము హరినిచూడగ!
'పరను ఇస్తారండి' అనెనే?సందియాన్నేతీర్చుకొనిరా
మురళి ఊదక నోము కాదే వెళ్ళనీయుము హరినిచూడగ!
సకల జీవుల సుఖంకోరీ ధను ర్మాసం మొదలు పెట్టాం
ఆపకింతటి మంచిదీక్షని దారి వదులుము హరినిచూడగ!
అసురవనితలు అనుకునేవో భక్తురాళ్ళము స్వామి వారికి
చెలిమిచేసిన చెలులమయ్యా అడ్డు తొలగుముహరినిచూడగ!
మనసునిచ్చిన ముద్దుగుమ్మల కానివారిగ కన్నడెంచడు
తలుపు రెక్కలు తెరిచి పంపీ చేయిసాయము హరినిచూడగ!
🌹 ధనుర్మాసం పదిహేడవరోజు పూజ 🌹: (17 వ రోజు)
పదిహేడవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: కల్యాణి
తాళం: ఏక
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 17 మూలం (తమిళము):
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
శ్రీనందగోపాల శ్రితపారిజాతమా మేలుకో!
నారాయణునిగన్న గోకులపుపుణ్యమామేలుకో!
నీరిచ్చి నీడిచ్చి నిత్యాన్నదానమే చేతువే
ధర్మతత్పరతలో సాటినీకెవరయ్య మేలుకో!
సుకుమారి సుమగాత్రి ఓయశోదమ్మా
స్త్రీజాతి రత్నమా వ్రేపల్లె దీపమా మేలుకో!
అన్నగా వచ్చాడు ఆఆది శేషుడే ఎరుగరే
బలశాలి బలరామ అసమాన తేజమా మేలుకో!
యదువంశ తిలకమా మాచిన్న కృష్ణయ్య
సాకారమైనట్టి భక్తజన స్వప్నమా మేలుకో!
🌹 ధనుర్మాసం పద్దెనిమిదవరోజు పూజ 🌹: (18 వ రోజు)
పద్దెనిమిదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: కనడ
తాళం: త్రిశ్ర త్రిపుట
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 18 మూలం (తమిళము):
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
గజబలుడు భుజబలుడు నందునీ కోడలివి రావమ్మనీళమ్మ!
వెనుకంజనెరుగనీ యదువంశ భామినివి రావమ్మనీళమ్మ !
కదనరంగమునందు నీమెట్టినింటికీ సాటిలేనేలేరు
పరిమళము వెదజల్లు కురులున్నసుందరివి రావమ్మనీళమ్మ !
కొక్కొరొక్కోఅంటు కోళ్ళన్ని కూశాయి వినిపించెనాతల్లి
మాధవీలతపైన కోయిలలు పాడినవి రావమ్మనీళమ్మ!
తెలవారె మాపైన దయజూపి తలుపులను తీయుమా
కరకమలములుకదల గాజులే మోగినవి రావమ్మనీళమ్మ!
మీబావ కృష్ణయ్య పొగడగా వచ్చాము నీవొచ్చిచూడుమా
నీరాక కోసమై మాకళ్ళు వెతికినవి రావమ్మనీళమ్మ!
🌹 ధనుర్మాసం పంతొమ్మిదవరోజు పూజ 🌹: (19 వ రోజు)
పంతొమ్మిదవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: సహన
తాళం: కంద చాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 19 మూలం (తమిళము):
కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
నీలాదేవీ కృష్ణుడు నీతో లోపల కలడని తెలిసేవచ్చాం !
నీకౌగిలిలో జగమేమరచీ శయనించాడని తెలిసేవచ్చాం!
గుత్తుల గుత్తుల దీపాలున్నవి పట్టెమంచమే ప్రకాశించినది
చూడచక్కనీ నీలనువీడీ మంచము దిగడని తెలిసేవచ్చాం !
ఎత్తుగమెత్తగ విశాలమైనా ఏనుగుదంతపు కోళ్ళమంచమది
శయనసుఖాన్నే పంచే పత్నికి దూరముకాడని తెలిసేవచ్చాం !
కాటుక కళ్ళూ నల్లని కురులూ నీలపేరు నీకమరెనుచక్కగ
పూలసుగంధం మత్తుగొలుపగా పవళించాడని తెలిసేవచ్చాం !
నీవక్షముపై లోకరక్షకుని నిదురపుచ్చగల భాగ్యశాలివీ
నీవుపంపక భువన మోహనుడు మాకు దొరకడని తెలిసేవచ్చాం !
హరిసమేతవౌ నీలాసుందరి భక్తులబ్రోవగ వేగమేలుకో
పతియూ గతియూ మాకందరికీ నారాయణుడని తెలిసేవచ్చాం!
🌹 ధనుర్మాసం ఇరయైవరోజు పూజ 🌹: (20 వ రోజు)
ఇరయైవ పాశురము మూలమూ, నేను చేసిన అనువాదమూ మీకోసం
గజల్ రచన: ఉమాదేవి జంధ్యాల
రాగం: హంసానంద
తాళం: కంద చాపు
సింబల్స్ సహకారం: శ్రీమతి సుమతి తిమ్మనగారు
చిత్రం: శ్రీ కేశవ్ ( గూగుల్ నుండి )
గానం: శ్రీమతి రత్న చెర్ల గారు
సహకారం: శ్రీమతి లక్ష్మీరాయవరపు
పాశురం - 20 మూలం (తమిళము):
ముప్పత్తు మూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
కప్పం తవిర్క్కుం కలియే! తుయిల్ ఏరాయ్
శెప్పం ఉడైయాయ్! తిఱలుడైయాయ్ శేత్తార్క్కు
వెప్పం కొడుక్కుం విమలా! తుయిల్ ఎరాయ్
శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్
నప్పినై నంగాయ్! తిరువే! తుయిలెరాయ్
ఉక్కముం తట్టొళియుం తందు ఉన్-మణాళనై
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు గజల్:
ముక్కోటి దేవతల ఇడుములను తొలగించు నాస్వామి మేలుకో!
అర్థాంగి యెదపైన హాయిగా పవళించు నాస్వామి మేలుకో!
భక్తజన మందార మాహృదయ సంచార మురహరీ నరహరీ
నిన్నునమ్మినవారి వైరివర్గముతుంచు నాస్వామి మేలుకో!
కరుణగల మాతల్లి శ్రీనీళ ! నీపతిని కాసేపు వదలవే
మధుమురళి వాయించి మోహాన భువిముంచు నాస్వామి మేలుకో!
బంగారు కలశాల తుల్యమౌ కుచశోభ గలిగినా తిరుచాన!
నీనీళ శృంగార సామ్రాజ్య మేలించు నాస్వామి మేలుకో !
అందమే చూపగా అద్దమూ; వీవగా చామరముఅవసరము
ఆరెండు మాకిచ్చి మానోము పండించు నాస్వామి మేలుకో!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి