మదన॥( గణపతి స్తుతి) గౌరీకు మార! లకుమీకర!శంభుపుత్రా! వీరాధి వీర! వర సేవిత పాద పద్మా! దారిద్ర్య మోచక! విఘాత వినాశకారీ! కారుణ్యమూర్తి! సకలాగమ సేవ్య మానా! మదన॥( గౌరీ స్తుతి) శ్రీకౌశికీ! యమరపూజిత రాజితాంఘ్రీ! రాకేందుబింబముఖి!శౌర్యవిభూషణాంబా! శాకంబరీ! యఖిల విశ్వమునేలు రాణీ! ప్రాకామ్యసిద్ధిద! సుఖప్రద! రక్ష నీవే!
పోస్ట్‌లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
గణపతి నవరాత్రులు- పద్యపూజ మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 1) చం॥ గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా! భుజములు నాల్గు గల్గిన విభూతి దలంపగమాకు శక్యమే! వ్రజమును గానమయ్య పదపద్మము బట్టక యాఖువాహనా! విజయము నిమ్ముకార్యముల విఘ్నములై నెరవేర దేవరా! వ్రజము= దారి కం॥ కదళిని దక్షిణ కరమున పదిలంబుగ చెఱకుగడను వామము నందున్ కుదురుగ బట్టిన గణపతి ముదమును గలిగించె బర్వి మోదకములకై ! ఉ॥ బాలుడు ముద్దుగూనయని ఫాలుడు దల్పక వ్రేటువేయగన్ గోలుమనేడ్చునా యగజ కోరిక దీర్పనేన్గుశీర్షమా బాలుకమర్పనా శిశువు ప్రాణము బొందెను శంభుశక్తితోన్ బాలగణాధిపున్ గొలువ బల్కుల తల్లియొసంగు విద్యలన్ ! ——————- డా. ఉమాదేవి జంధ్యాల 2) గణపతి నవరాత్రులు సందర్భంగా రెండవ రోజు.. తరుణ గణపతి 1)సీ॥ అరుణవర్ణముగలఁ దరుణగణపతిని బూజింపఁగార్యముల్ బూర్తి యగును చెరకుగడనుబట్టి చెరుపునుఁబోగొట్టి సరిజేయు మార్గంబు సవ్యముగను! పాశాంకుశాదులన్ బట్టిహస్తములందు పాపాత్ములబనిని బట్టునితడు! అగజాననుండిచ్చు యౌవనోత్సాహముల్ గొల్వగ యువకులు గూర్మితోడ! ఆపదలదీర్చు నర్థింప నార్తితోడ వృత్తి వ్యాపారములయందు వృద్ధినిచ్చు! పారద్రోలును నిస్పృహ భయము బాపు! తరుణ...